ఉన్నత చదువులకు విజ్ఞాన్ పాఠశాల కేంద్రబిందువు..
ఉన్నత చదువులకు విజ్ఞాన్ పాఠశాల కేంద్రబిందువు..
బిక్కనూర్, ఆంధ్ర ప్రభ : ఉన్నత చదువులకు విజ్ఞాన ఉన్నత పాఠశాల కేంద్రబిందువుగా తెలుస్తుందని ఆ పాఠశాల కరస్పాండెంట్ విజయభాస్కర్ రెడ్డి అన్నారు .పాఠశాలలో 2023-2024 సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు ఇటీవల విడుదలైన ఎంసెట్, జేఈఈ మెయిన్స్ లో ర్యాంకులు సాధించారు వారిని ఈ సందర్భంగా పాఠశాలలో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ పాఠశాలలో చదివినా నాగర్తి ప్రజ్ఞ ఎంసెట్ ఫలితాలలో రాష్ట్రస్థాయిలో 2814 ర్యాంకుతో పాటు జేఈఈ మెయిన్స్ లో 8003 ర్యాంకు సాధించారన్నారు. అలాగే ఏనుగు సిరివెన్నెల ఎంసెట్ ఫలితాలలో 7321 ర్యాంకు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. విజ్ఞాన్ పాఠశాలలో మెరుగైన విద్యా బోధనతో పాటు అనుభవం గల అధ్యాపకులతో విద్యాబోధన అందించడం జరుగుతుందన్నారు. తమ పాఠశాలలో చదివిన ఇద్దరు విద్యార్థులు ర్యాంకులు సాధించడం ఎంతో అభినందనీయమన్నారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు.
