janasena | లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో…

janasena | లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో…
janasena | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : జనసేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన శాసనసభ విప్ పదవికి రాజీనామా చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. శనివారం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు.
వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీధర్ వెల్లడించినట్లు జనసేన వర్గాలు తెలిపాయి. తనపై వచ్చిన ఆరోపణలపై పవన్ కళ్యాణ్‌కు ఆయన వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఈ ఆరోపణలపై జనసేన పార్టీ ఇప్పటికే త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
