జొన్న రైతుల సమస్యలు పరిష్కరించండి

జొన్న రైతుల సమస్యలు పరిష్కరించండి

-జిల్లా జాయింట్ కలెక్టర్ కు మార్క్ ఫెడ్ డైరెక్టర్ వినతి

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ

నంద్యాల పార్లమెంట్ పరిధిలోగల 15 మండలాలలో జొన్న రైతుల సమస్యలు పరిష్కరించాలని లైఫ్ లాంగ్ వదులుకోవాలని వారికి న్యాయం చేయాలని మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం జొన్న రైతులు పడుతున్న సమస్యల ను జె సి దృష్టికి తెచ్చారు.పార్లమెంటు పరిధిలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జొన్న రైతులు వేర్ హౌస్ గోడౌన్ వద్ద పడిగాపులు కాస్తున్నారన్నారు. గత మూడు రోజులుగా రైతులు వస్తున్నా రైతులకు సంబంధించిన జొన్నలు త్వరితగతిన అన్లోడ్ కావడంలేదని జేసీ కి ఫిర్యాదు చేశారు.రైతులు పండించిన జొన్నలు అన్ని కొనుగోలు చేసేవిధంగా చూడాలని జేసీ ణి కోరారు.

అధికారులు రైతులను ఇబ్బందులు పెట్టకుండా చూడాలన్నారు. రైతులకుసంబంధించిన జొన్నలు 10 వేల టన్నులు ప్రభుత్వ అనుమతితో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరా రు.జేసీ మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.కృష్ణాపురంకు చెందిన సీనియర్ రైతు నాయకులు ఉప్పలపాటి బాలిశ్వర రెడ్డి, రామ కృష్ణా రెడ్డి, మురళీధర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ,ఇతర గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.

Leave a Reply