బాపురంలో విషాదం… పంప్‌హౌస్ శుభ్రం చేస్తూ…

బాపురంలో విషాదం… పంప్‌హౌస్ శుభ్రం చేస్తూ…
- యువకుడి మృతి
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ: హాలహర్వి మండలం బాపురం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పంప్‌హౌస్‌ను శుభ్రం చేసే సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఓ యువకుడు మృతిచెందాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధగిరి గ్రామానికి చెందిన సూరి బాపురం గ్రామంలోని పంప్‌హౌస్‌లో శుభ్రపరిచే పనులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అకస్మాత్తుగా జారి నీటిలో పడిపోవడం వల్ల మునిగిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సూరి మృతితో అర్ధగిరి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి.
