రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం..

ఆసిఫాబాద్ రూరల్, ఆంధ్రప్రభ : మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ భారతదేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం అని జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆత్రం సుగుణ అన్నరు.గురువారం రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లాకేంద్రం లోని డిసిసి కార్యాలయంలో రాజీవ్ గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో .నియోజకవర్గ ఇంచార్జ్ అజ్మీర శ్యాం నాయక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల మంగ పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధికి, ఆధునిక భారత నిర్మాణానికి విశేష కృషి చేశారని అన్నారు. యువతకు సాంకేతికతను చేరువ చేస్తూ దేశాన్ని ఆధునికీకరణ దిశగా తీసుకెళ్లిన నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు.Q ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధక్షులు ఉబెద్ బిన్ యాహియ(తారిఖ్), భీమ్ రావు,ప్రధాన కార్యదర్శి చిన్న మల్లేష్,ఎన్ ఎస్. యు ఐ జిల్లా అధ్యక్షులు అసిఫ్ మాజీ, ఎంపీపీ బాలేష్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు జక్కన్న,మారుతీ పటేల్, కౌన్సిలర్ కార్తీక్, నాయకులు హనుమండ్ల సాయి,మాజీ ఎంపీటీసీ సిడాం తిరుపతి,ఆత్మ చైర్మన్ సత్తన్న,చునర్కర్ వాసుదేవ్.తదితరులు పాల్గొన్నారు.
