వైసీపీ పాలనలో దళితులపై హత్యాకాండ

వైసీపీ పాలనలో దళితులపై హత్యాకాండ
- తోట సీతారామలక్ష్మి
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: వైసీపీ పాలనలో దళితులపై హత్యాకాండ ఘటనలు కొనసాగాయని మాజీ ఎంపీ, భీమవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ తోట సీతారామలక్ష్మీ అన్నారు. భీమవరం పట్టణ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో స్థానిక పట్టణ 23వ వార్డు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ పాలనలో రాజకీయ హత్యకు గురైన దళిత నాయకుల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎంపీ, భీమవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ తోట సీతారామలక్ష్మీ మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో దళితులపై హత్యకాండ జరిగిందని ఆరోపించారు. ఎమ్మెల్సీ డ్రైవర్ దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను హింసించి, హత్యచేసి అతని ఇంటికి శవాన్ని పార్సిల్ చేశారని, దళిత డాక్టర్ సుధాకర్ కోవిడ్ సమయంలో మాస్క్ అడిగినందుకు పిచ్చివానిగా ముద్రవేసి, విధుల నుండి సస్పెండ్ చేసి వేధించి అంతమొందించారన్నారు.
రాష్ట్రంలోని దళితుల అండతో వైసిపి అధికారంలోకి వచ్చి దళితులపై హత్యా రాజకీయాలు చేసి వారి సంక్షేమం, అభివృద్ధికి ఆటంకం కలిగించారని విమర్శించారు. టిడిపి రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ వైసిపి హయాంలో దళితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి దళితులను అణిచివేశారని, వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దళితులపై కక్షతో హింసించి రాజకీయ హత్యలు చేశారన్నారు.
టిడిపి కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ పాలనలో దళితులపై దమనకాండ జరిగిందని ప్రస్తుత కుటమీ పాలనలో దళితుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఎఏంసి చైర్ పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు మాట్లాడుతూ వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును, డాక్టర్ సుధాకర్ మరణాల పై నాటి వైసిపి ప్రభుత్వ పోలీసు కేసులు విచారణ న్యాయబద్ధంగా జరగలేదని కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దళిత కుటుంబాలకు న్యాయం, దళితులకు రక్షణ కల్పిస్తున్నారని తెలిపారు.
టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎద్దు యేసుపాదం మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ పాలనలో దళితుల ఆస్తులకు మాన ప్రాణ రక్షణ లేకుండా పోయిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దళిత ద్రోహిగా వ్యవహరించారని, దళితుల అభివృద్ధికి కేటాయించిన నిధులను దారి మళ్ళించి దళితులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. పట్టణ టిడిపి అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చల్లబోయిన గోవింద్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో దళితులపై జరిగిన ఘోరాలు దళిత సామాజకానికి కనువిప్పు కలిగించే సంఘటనలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్ష కార్యదర్శులు యళ్ల వెంకటేశ్వరరావు, అనపర్తి కృష్ణ ప్రసాద్ , మున్సిపల్ మాజీ చైర్మన్ మెరగాని నారాయణమ్మ, కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి షబీనా జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాత సురేష్ బాబు, పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆంబళ్ళ జోగేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
