రాజీవ్ గాంధీ సేవలు దేశానికి మార్గదర్శకం

రాజీవ్ గాంధీ సేవలు దేశానికి మార్గదర్శకం

-ఆధునిక భారత స్వాప్నికుడు, సంస్కరణల సృష్టికర్త రాజీవ్ గాంధీ
-కమ్మర్‌పల్లిలో ఘనంగా 35వ వర్ధంతి వేడుకలు
-కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోనగిరి భాస్కర్

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ:
భారతరత్న, భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ సేవలు దేశానికి ఎల్లప్పుడూ మార్గదర్శకమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోనగిరి భాస్కర్ పేర్కొన్నారు. గురువారం కమ్మర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి నాయకులు, కార్యకర్తల సమక్షంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బోనగిరి భాస్కర్ మాట్లాడుతూ.. ప్రపంచం ముంగిట నేడు భారతదేశం అగ్రగామిగా నిలిచిందంటే, నాడు రాజీవ్ గాంధీ అమలు చేసిన సంస్కరణల పుణ్యమేనని కొనియాడారు. విద్య, సాంకేతికత, గ్రామీణాభివృద్ధి, ఆర్థిక సంస్కరణలే దేశ ప్రగతికి మూలస్తంభాలని నమ్మిన నాయకుడన్నారు. ఐటీ రంగానికి పితామహుడిగా, టెలికమ్యూనికేషన్ విప్లవానికి ఆద్యుడిగా దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లిన దార్శనికుడిగా రాజీవ్ గాంధీ చరిత్రలో చెరగని ముద్ర వేశారని గుర్తుచేశారు.

మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధనకు బలమైన పునాదులు వేస్తూ.. స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించారని, యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు అందించి రాజ్యాంగ సవరణలు తెచ్చారన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన ప్రవేశపెట్టిన కీలక సంస్కరణలు ఎప్పటికీ ఆచరణీయమని, ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్ గాంధీ చూపిన బాట నేడు ప్రతి ఒక్కరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య, వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, మాజీ మండల అధ్యక్షుడు సుంకేట రవి, డీసీసీ నాయకులు మురళి, తక్కురి దేవేందర్, తిప్పిరెడ్డి శ్రీనివాస్, బోనగిరి లక్ష్మణ్ పాల్గొన్నారు. అలాగే కమ్మర్‌పల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సల్లూరి గణేష్ గౌడ్, బుచ్చి మల్లయ్య, అలకుంట రాజేష్, వన్నెలా రాజేశ్వర్, నిమ్మ రాజేంద్రప్రసాద్, అజ్మత్ పాషా, అబ్దుల్ అజహరోద్దీన్, గోవింద్ శేఖర్, శివసారం గణేష్, శివసారం నరేష్, సుమన్, మారుపక నరేష్, సుంకరి విజయ్, కౌడ శైలేందర్, సంపంగి నాగరాజు తదితర కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply