13 నుంచి ఉచిత సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్‌

13 నుంచి ఉచిత సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్‌

  • నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్ కేంద్రాల్లో ప్రారంభం
  • జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి వెంకటరెడ్డి

నిజామాబాద్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్ ఈ నెల 13వ తేదీ బుధవారం నుండి ప్రారంభం కానుందని జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటరెడ్డి తెలిపారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనుబంధంగా నిర్వహిస్తున్న ఈ క్యాంప్‌ను నిజామాబాద్, కామారెడ్డి మరియు ఆర్మూర్ కేంద్రాలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ కోచింగ్ క్యాంప్‌లో 12 సంవత్సరాలు పైబడిన, 25 సంవత్సరాలు లోబడిన బాలురు, బాలికలు పాల్గొనవచ్చని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 5:30 గంటల నుండి 8:30 గంటల వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడతాయని వెల్లడించారు. నిజామాబాద్ కేంద్రంగా జీజీ కాలేజ్ గ్రౌండ్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. క్రికెట్‌పై ఆసక్తి కలిగిన యువ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని శిక్షణ పొందాలని అసోసియేషన్ కోరింది.

అనుభవజ్ఞులైన కోచ్‌ల పర్యవేక్షణలో శిక్షణ అందించబడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అసోసియేషన్ అధ్యక్షులు చంద్రసేన్ రెడ్డి, కార్యదర్శి వెంకట్ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్ రావు, సంయుక్త కార్యదర్శి సురేష్ బాబు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు కోచ్‌లు లలిత్ (94949 59059), నయీమ్ (81060 60600)లను సంప్రదించాలని సూచించారు.

Leave a Reply