ఉపాధి కూలీలు ఎండ తీవ్రతతో జాగ్రత్త పాటించాలి

ఉపాధి కూలీలు ఎండ తీవ్రతతో జాగ్రత్త పాటించాలి
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్‌గల్ మండలంలోని బాచన్ పల్లి గ్రామంలో బుధవారం ఉపాధి హామీ పథకం కింద పల్లె చెరువులో కొనసాగుతున్న పూడికతీత పనుల సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు గ్రామ సర్పంచ్ వెన్నెల బాలమణి జనార్ధన్, పంచాయతీ కార్యదర్శి సంజయ్ ఆధ్వర్యంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ, కార్యక్రమంలో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కూలీల ఆరోగ్య పరిరక్షణ కోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేస్తున్నామని అన్నారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వెన్నెల బాలమణి జనార్ధన్, కార్యదర్శి సంజయ్ మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి కోసం ఉపాధి హామీ కార్మికులు చేస్తున్న సేవ ఎంతో గొప్పది. తీవ్రమైన ఎండలు సైతం గ్రామం కోసం కష్టపడుతున్న ప్రతి కార్మికుడి ఆరోగ్యం మా బాధ్యత , వారి శ్రమతోనే గ్రామల చెరువులు పునరుద్ధరించబడుతూ, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కార్మికుల సంక్షేమానికి గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది, అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఫీల్డ్ ఆఫీసర్,పాలకవర్గం సభ్యులు గ్రామపంచా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
