ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలి

ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలి
రాప్తాడు, ఆంధ్రప్రభ : వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోవడం యాంత్రీకరణ పెరగడంతో గ్రామీణ పేదలకు పనులు తగ్గిపోతున్నాయని ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర నాయకులు బాల రంగయ్య పేర్కొన్నారు. రాప్తాడు మండల కేంద్రం నందు వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ కూలీలతో సమావేశం నిర్వహించారు. అనంతరం డిప్యూటీ ఎంపీడీవో అచ్యుతానంద బాబుకి వినతిపత్రం అందజేశారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ ఉపాధి హామీకి మన రాష్ట్రానికి 10వేల కోట్లు కేంద్రం నిధులు కేటాయించాలి. సమ్మర్ అలవెన్స్ కొనసాగించాలి. మంచినీళ్ళు మజ్జిగ సౌకర్యం కల్పించాలి.
30 రోజులుపని చేసిన ప్రతి కుటుంబానికి పనిముట్లు ప్రతిగ్రూప్ కు టెంట్ మెడికల్ కిట్ ఇవ్వాలి. ఉపాధి వేతనదారులు ప్రమాదంలో మరణిస్తేరూ. 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి.ఫేస్ యాప్ రద్దు చేయాలి. రెండు పూటల పనిపద్దతి రద్దు చేయాలి. కుటుంబానికి 200 రోజులు పని రోజుకి రూ.700 లు వేతనం ఇవ్వాలి. అవినీతిని అరికట్టాలి.పని ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నవారికి పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలి. పాత బకాయిలు పెండింగ్ వేతనాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి టి. రామాంజనేయులు రైతు సంఘం మండల కార్యదర్శి పోతలయ్య నారాయణస్వామి సుబ్బిరెడ్డి పెద్దరాజప్ప చంద్రాయుడు ఆదినారాయణ రెడ్డి కే. నరసింహారెడ్డి సుఖారియే జిల్ పెద్దక్క తదితరులు పాల్గొన్నారు.
