నెట్టెం రఘురాంకు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

నెట్టెం రఘురాంకు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
మీ అభిమానానికి రుణపడి ఉంటా
జిల్లా కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం
జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : జిల్లా కేడీసీసీ బ్యాంకు చైర్మన్ మాజీ మంత్రి నెట్టెం రఘురాం కు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ఆత్మీయ సన్మానాన్ని నిర్వహించి స్వీట్స్ అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం నెట్టెం రఘురాం జన్మదిన సందర్భంగా పట్టణములోని కమల థియేటర్ సమీపంలోని నెట్టెం రఘురాం నివాసానికి ఉమ్మడి జిల్లా నుండి టిడిపి పార్టీ నాయకులు ,అభిమానులు, కార్యకర్తలు, వివిధ సొసైటీల చైర్మన్లు డైరెక్టర్లు రఘురాం ను కలసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా అభిమానులు నాయకులు ప్రజాప్రతినిధులతో కలసి నెట్టెం రఘురాం కేక్ కటింగ్ చేసి విచ్చేసిన వారికి మిఠాయిలు అందజేశారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ మీ ఆత్మీయ అభిమానానికి రుణపడి ఉంటానని తెలిపారు. సొసైటీల చైర్మన్లు, పార్టీ నాయకు లు రఘురాం కు ఆత్మీయ సన్మానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు నియోజకవర్గం లోని టిడిపి నేతలు ,నెట్టెం రఘురాం కు శుభాకాంక్షలు తెలిపారు.
