Ap Cm Couple : కల్తీ లేదు.. కార్భైడ్​ లేదు Andhra Prabha Spl News

Ap Cm Couple : కల్తీ లేదు.. కార్భైడ్​ లేదు Andhra Prabha Spl News

  • తాజా ముంజెలు వేరయా
  • ఏపీ సీఎం దంపతుల కితాబు

( ఆంధ్రప్రభ, కుప్పం )

Ap Cm Couple

ఆయన ఏపీ సీఎం. 40 ఏళ్లుగా రాజకీయాల్లో క్షణం తీరిక లేని నేత. ఆయనే ఏపీ విజనరీ లీడర్​ నారా చంద్రబాబు నాయుడు. ఇక ఆమె హెరిటేజ్​ ఫుడ్స్​ అధినేత్రి. వ్యాపారంలో బిజీబిజీ లేడీ టైకూన్​. ఇద్దరూ ప్రతి క్షణం భవిష్యత్తుపై ఆలోచనలతో.. క్షణం తీరిక లేని దంపతులు. ఈ రోజున అనుకోని దృశ్యంలో.. జనాన్ని ఔరా అనిపించారు. మండుటెండలో.. తాటికాయల్లో లేత ముంజల్నీ జుర్రుతూ.. పాత రోజల్ని.. చిన్నప్పటి క్షణాలను గుర్తు చేసుకున్నారు. ..

Ap Cm Couple : అసలేం జరిగిందంటే…

Ap Cm Couple

కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం తిరుగు ప్రయాణంలో ముఖ్యమంత్రి దంపతులు చంద్రన్న, భువనమ్మ తంజమ్మకొట్టాలు దగ్గర ఆగారు. కల్లుగీత కార్మికులు తాటిముంజలు తీస్తుండగా కాన్వాయ్‌ను ఆపారు. గీత కార్మికుల దగ్గరకు వెళ్లారు. ముంజలు తీసి ఇవ్వండి… రుచి చూస్తాం అని సీఎం చంద్రబాబు దంపతులు… అడిగారు. అందించిన తాజా తాటిముంజలను సీఎం దంపతులు రుచి చూశారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మికులతో ముఖ్యమంత్రి కాసేపు ఆత్మీయంగా మాటా మంతీ పంచుకున్నారు. కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.

Ap Cm Couple : కల్తీ లేదు..కార్బైడ్​ లేదు

Ap Cm Couple

ఇక సీఎం చంద్రన్న తన అనుభవాన్ని ఎక్స్​ ఖాతాలో పంచుకున్నారు. కల్తీ లేదు. కార్బైడ్​ లేదు. పురుగు మందుల గోల లేదు. కుప్పం ప్రజల్లాంటి స్వచ్చమైన చల్లనైన తాటి ముంజెలు రోడ్డు పక్కన రోడ్డు పక్కన ఆగి తింటుంటే ఎంతో హాయిగా ఉంది. మన గ్రామీణ మన గ్రామీణ ఉత్పత్తులను మించింది మరి ఏముంటుంది; అని సీఎం చంద్రబాబు అన్నారు.

Ap Cm Couple


ఎనీ హౌ.. చంద్రన్న దంపతులకు చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చిన మాట నిజం. బడికి వెళ్లే ప్రాయంలో .. వేసవి సెలవుల్లో తాడి తోపుల్లో తాటికాయలను కోసి.. తాము ముంజెలు ఆరగించిన విషయం చంద్రన్న గుర్తు చేసుకోగా.. భువనమ్మ సైతం గుర్తుకొస్తున్నాయను కోవటం సర్వసాధారణమే.

Ap Cm Couple

ALSO READ : Nara Chandrababu Naidu | నమో గంగమ్మ తల్లీ

Leave a Reply