ఏపీకి పెట్టుబడులే లోకేష్ లక్ష్యం

ఏపీకి పెట్టుబడులే లోకేష్ లక్ష్యం

-ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్

ఆంధ్రప్రభ, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డూండి రాకేష్ మంగళవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యుల సంక్షేమం, సమాజ అభివృద్ధికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై వీరు సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో వ్యాపార వర్గాలకు పూర్తి అనుకూల వాతావరణం కల్పించడం, యువతకు ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున పెంచే దిశగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా డూండి రాకేష్ అభినందించారు.

మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద ఎత్తున జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ సంస్థలు తరలివస్తున్నాయని డూండి రాకేష్ పేర్కొన్నారు. నవ శకానికి నాంది పలుకుతూ యువ నాయకత్వంలో రాష్ట్ర పారిశ్రామిక రంగం వేగంగా విస్తరిస్తోందని, దీనివల్ల రాష్ట్ర యువతకు స్థానికంగానే ఎన్నో ఉద్యోగావకాశాలు మెరుగవుతున్నాయని స్పష్టం చేశారు. వ్యాపార వర్గాలు, ఆర్యవైశ్య సమాజం, ఏపీ యువత తరఫున మంత్రి లోకేష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మంత్రికి ఆర్యవైశ్య కార్పొరేషన్ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా ప్రకటించారు.

Leave a Reply