కోర్టు భవన నిర్మాణ పనుల పరిశీలన

కోర్టు భవన నిర్మాణ పనుల పరిశీలన

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ:
భీంగల్ పట్టణంలో నూతనంగా కోర్టు మంజూరైన నేపథ్యంలో దానికి సంబంధించిన భవన నిర్మాణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ఈ పనులను మంగళవారం ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కుదురుపాక ప్రవీణ్ చందర్ ఆధ్వర్యంలో న్యాయవాదుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భవన పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పనులు పూర్తయిన వెంటనే వీలైనంత త్వరగా కోర్టును ప్రారంభించి స్థానిక ప్రజలకు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. కోర్టు అందుబాటులోకి వస్తే ఈ ప్రాంత ప్రజలకు న్యాయసేవలు మరింత దగ్గరవుతాయన్నారు. భవన పరిశీలన చేసిన వారిలో ప్రవీణ్ చందర్ వెంట న్యాయవాదులు గట్టు గంగాధర్, షిండే, గంట విప్లవ్, కిరణ్, చైతన్య, శ్రవణ్ తదితరులు ఉన్నారు.

Leave a Reply