ప్రధాని పిలుపు స్వర్ణ కారుల్లో జీవనానికి గొడ్డలి పెట్టు

ప్రధాని పిలుపు స్వర్ణ కారుల్లో జీవనానికి గొడ్డలి పెట్టు

ఎమ్మిగనూరు టౌన్, ఆంధ్రప్రభ : ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు స్వర్ణ జీవనానికి గొడ్డలి పెట్టు అని ఆ సంఘ అధ్యక్షులు మెహబూబ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మంగళవారం దీనిని నిరసిస్తూ రాష్ట్ర సంఘం పిలుపులో భాగంగా ఎమ్మిగనూరు పట్టణం లో స్వర్ణకార దుకాణాలు, అనుబంధ వ్యాపార సముదాయాలను యజమానులు స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు మద్దతు ప్రకటించారు.. ఒక సంవత్సరం పాటు బంగారం కొనవద్దంటూ ప్రధాని ఇచ్చిన పిలుపుకు వ్యతిరేకంగా స్వర్ణకారులు, కార్మికులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్వర్ణకార కార్మిక సంఘం అధ్యక్షుడు మెహబూబ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తరతరాలుగా ఈ వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న లక్షలాది స్వర్ణకార కుటుంబాల పొట్టగొట్టేలా ఉన్నాయని మండిపడ్డారు.

ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ రంగానికి ప్రధాని ప్రకటన తీవ్ర నష్టం చేకూరుస్తుందని, కార్మికులు ఉపాధి కోల్పోయి వీధిన పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి స్వర్ణకార కార్మికుల హక్కులను కాపాడటంతో పాటు, ప్రధాని పిలుపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం స్వర్ణకారులంతా భారీ ర్యాలీగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని స్వర్ణకార సంఘాల నాయకులు, కార్మికులు, యజమానులు పాల్గొన్నారు.