పుచ్చలపల్లి సుందరయ్యకు నివాళులు

పుచ్చలపల్లి సుందరయ్యకు నివాళులు

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావడమే సుందరయ్య కి మన ఇచ్చిన ఘనమైన నివాళని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు అన్నారు. సుందరయ్య 41వ వర్ధంతి సభను శ్రీకాకుళం 7 రోడ్లు జంక్షన్ వద్ద ర్యాలీ నిర్వహించి అనంతరం సిపిఎం నాయకులు మాట్లాడుతూ, స్వతంత్ర సమరయోధుడు, దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమం నిర్మాత, తొలి పార్లమెంట్ ప్రతిపక్ష నేత కామ్రేడ్ సుందరయ్య తన యావత్ జీవితాన్ని సమస్త ప్రజలకు అంకితం చేసిన ఒక గొప్ప పోరాట యోధుడని కొనియాడారు.

కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సుందరయ్య జమీందారీ వ్యతిరేక పోరాటాన్ని, తెలంగాణ సాయుధ పోరాటం నిర్మించి వేలాది ఎకరాల భూమిని పేదలకు పంచిన పోరాట యోధుడని కొనియాడారు. నేటి ప్రభుత్వ పాలకలు ప్రజల భూములను కొల్లగొట్టి కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టడానికి పూనుకుంటున్నారని దీనికి వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆస్తులను కొల్లగొట్టి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి పూనుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా విధ్వంసం చేసే అణు విద్యుత్ కేంద్రాన్ని రద్దు చేయాలని, కార్గో ఎయిర్ పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని, సరుబుజ్జిలి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదన రద్దు చేయాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని, సముద్రతీర ప్రాంతాన్ని అదాని వంటి కార్పొరేట్ కంపెనీలకు కట్ట పెట్టొద్దని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి సమర సీల పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ర్యాలీ అనంతరం సుందరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ వివిధ ప్రజా సంఘాల నాయకులు అల్లు సత్యనారాయణ, కొత్తకోట అప్పారావు, ఎం గోవర్ధన్ రావు, ఎం ఆదినారాయణమూర్తి, ఎం ప్రవీణ, బి చిన్నారావు, ఎస్ వెంకట్రావు, జె జ్యోతిరావు కె చంద్రశేఖర్, బి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply