19th May 2026 | తిరుమల సమాచారం..

19th May 2026 | తిరుమల సమాచారం..
19th May 2026 | తిరుమల, ఆంధ్రప్రభ :
ఓం నమో వెంకటేశాయ..
“ఓం నమో వేంకటేశాయ కామితార్థ ప్రదాయినే,
ప్రణతః క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః”
అర్థం:
కోరికలను తీర్చే, శరణాగతుల దుఃఖాలను తొలగించే
గోవిందుడైన వేంకటేశ్వరునికి నమస్కారం.
శ్రీవారి దర్శనం కోసం..
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. సోమవారం తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా నమోదైంది. శ్రీవారిని దర్శించుకున్న మొత్తం భక్తుల సంఖ్య 80,455గా నమోదైంది.
శ్రీవారి ఆదాయం..
శ్రీవారికి మొక్కులు చెల్లించుకునే భాగంగా 43,309 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన హుండీ కానుకల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.4.41 కోట్ల ఆదాయం లభించింది.
సాధారణ సర్వదర్శనానికి..
భక్తుల రద్దీ పెరగడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని వేచి చూసే గదులు పూర్తిగా నిండిపోయాయి. ప్రస్తుతం భక్తుల క్యూ లైన్లు శిలాతోరణం వెలుపల వరకు కొనసాగుతున్నాయి. ఎస్ఎస్డీ టోకెన్లు లేని సాధారణ సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు.
