iran-us-china-relations I 1826 I ఇరాన్ ను ఒంట‌రి చేయ‌డ‌మే…

  • చైనా, అమెరికా మ‌ధ్య ర‌హ‌స్య ఒప్పంద‌మా?
  • హోర్ముజ్ స్వాధీనానికి అమెరికా అడుగులు
  • జ‌ల‌సంధి తెరిపించ‌డానికి ప్ర‌య‌త్నాలు
  • చైనా స‌హ‌కారం కోరి ఉండ‌వ‌చ్చు అనే అనుమానాలు
  • తైవాన్ కు నో హెల్ప్‌.. స్వ‌రం మార్చిన అమెరికా
  • ఇరాన్‌కు సైనిక ప‌రిక‌రాలు చైనా అందించ‌ద‌ని ట్రంప్ వెల్ల‌డి
  • నోరుమెద‌ప‌ని చైనా… అమెరికా మాట‌లు న‌మ్మ‌క త‌ప్ప‌దు!
  • ట్రంప్‌కు క‌లిసొచ్చిన చైనా ప‌ర్య‌ట‌న‌

iran-us-china-relations I 1826 I ఆంధ్రప్ర‌భ వెబ్ (అంత‌ర్జాతీయం) : చైనా ప‌ర్య‌ట‌న త‌ర్వాత అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తీరు చూస్తుంటే ఇరాన్‌ను ఒంట‌రిత‌నం చేసి హోర్ముజ్ జ‌ల‌సంధిని స్వాధీనం చేసుకోవ‌డానికి ఎత్తుగ‌డులు వేస్తున్న‌ట్లు ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. అందుకే చైనా విష‌యంలో అమెరికా ఒక మెట్టు దిగిన‌ట్లు క‌నిపిస్తున్న‌ది. ఇరాన్‌కు చైనా ఆయుధ సంప‌త్తి స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ద‌ని ప్ర‌పంచానికి వేరే చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ప‌శ్చిమాసియ ఉద్రిక్త‌త‌ల మ‌ధ్య హోర్ముజ్ జ‌ల‌సంధిని ఇరాన్ మూసి వేయ‌డంతో ప్ర‌పంచంలో ఆయిల్ సంక్షోభం త‌లెత్తింది. ఇరాన్‌- ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధం నేప‌థ్యంలో ప్ర‌పంచంలో ఆయిల్ సంక్షోభం రావ‌డం, అమెరాకకు ఎయిర్ బేస్ ఇచ్చిన యూఏఐ దేశాల‌పై ఇరాన్ దాడి చేసి ఆయిల్ రిఫైన‌రీల‌ను టార్గాట్ చేయ‌డంతో ఆయిల్ ధ‌ర‌లు పెరిగిన సంగ‌తి విదిత‌మే. హోర్ముజ్ జ‌ల‌సంధిని స్వాధీనం చేసుకుంటే ఇరాన్ ఆయువుప‌ట్టు పోయిన‌ట్టే అని అమెరికా భావించింది. హోర్ముజ్ జ‌ల‌సంధి స్వాధీనం చేసుకోవ‌డానికి నాటో దేశాల మ‌ద్ద‌తును అమెరికా కోరింది. కానీ నాటో దేశాలు మ‌ద్ద‌తు ల‌భించ‌లేదు. దీంతో ఇరాన్‌కు ఆయుధ సంప‌త్తి అంద‌జేస్తున్న చైనాతో మిత్ర‌త్వం చేసుకుంటే హోర్ముజ్ జ‌ల‌సంధిని స్వాధీనం చేసుకునే అవ‌కాశం ఉంద‌ని ఆలోచ‌న‌ను అమెరికా అమ‌లు చేసింది.

iran-us-china-relations

iran-us-china-relations I 1826 I నోరు విప్ప‌ని చైనా..
చైనా లో ప‌ర్య‌టించిన అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌, చైనా అధ్య‌క్షుడు షీ జిన్‌పింగ్ మ‌ధ్య రెండు ద‌ఫాలుగా చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఆ చ‌ర్చ‌లు సారాంశం బ‌య‌ట ప్ర‌పంచానికి తెలియ‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కూ అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ చేసిన ప్ర‌క‌ట‌న‌లు త‌ప్ప చైనా అధ్య‌క్షుడు మాత్రం నోరు విప్ప‌డం లేదు. చైనా అధ్య‌క్షుడు షీ నోరు ఇప్ప‌క‌పోవ‌డమే అమెరికాకు క‌లిసొచ్చిన అంశం. ఎందుకంటే అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ప్ర‌క‌ట‌న‌ల‌పై ప్ర‌పంచ దేశాల్లో ఒక చ‌ర్చ మొద‌ల‌వుతున్న‌ది. వీరిద్ద‌రి మ‌ధ్య తైవాన్‌, ఇరాన్ అంశాలు చ‌ర్చకు వ‌స్తాయ‌ని ప్ర‌పంచ దేశాలు భావించాయి. కానీ ఈ రెండు అంశాల‌పై చైనా, అమెరికా మ‌ధ్య ఏకాభిప్రాయం కుదిరింద‌న్న భావ‌న మాత్రం ప్ర‌పంచ దేశాల్లో ఉంది.

iran-us-china-relations

iran-us-china-relations I 1826 I తైవాన్ కు నో హెల్ప్‌.. స్వ‌రం మార్చిన అమెరికా
చైనా ప‌ర్య‌ట‌న అనంత‌రం అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ మాట‌లు చూస్తే ఇక నుంచి తైవాన్‌కు సాయం చేసే ప‌రిస్థితి లేన‌ట్లు అనిపిస్తుంది. భౌగోళికంగా తైవాన్ అమెరికాకు చాలా దూరంలో ఉంది. తైవాన్‌ ద్వీపం చైనా కు కేవలం 95 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమెరికాకు మాత్రం 15 వేల కిలోమీటర్లకుపైగా దూరాన ఉంది. ఎక్కువ దూరం కాబట్టి వేగంగా స్పందించడం క‌ష్టం. చైనా చాలా శక్తిమంతమైన పెద్ద దేశం. తైవాన్‌కు స‌హాయం చేయ‌డంలో అమెరికా చేతులెత్తేసింది. ఉద్రిక్తతల విషయంలో చైనా, తైవాన్‌లు సంయమనం పాటించాలని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌ సూచించారు. తైవాన్‌కు ఆయుధాలు విక్రయించాలా, వద్దా అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ట్రంప్‌ చెప్పారు. ఈ వ్యాఖ్యలు కూడా ఆయన వైఖరిలో మార్పును వెల్లడిస్తున్నాయి.

iran-us-china-relations

iran-us-china-relations I 1826 I హోర్ముజ్ జ‌ల‌సంధిపై అమెరికా, చైనాది ఒకే మాట‌…
ఇరాన్ విషయంలో తనకు, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు ఒకే విధమైన అభిప్రాయాలు ఉన్నాయని, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని ఇద్దరూ కోరుకుంటున్నామ‌ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. టెహ్రాన్‌కు చైనా సైనిక పరికరాలను అందించదని షీ తనకు హామీ ఇచ్చారని కూడా ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు ఐదో వంతు ప్రయాణించే హోర్ముజ్ జలసంధి, కొనసాగుతున్న ఈ ఘర్షణల మధ్య తీవ్ర అంతరాయాలను ఎదుర్కొంటోంది. అమెరికాకు మాట ఇచ్చిన ప్ర‌కారం ఇరాన్‌కు చైనా సైనిక ప‌రిక‌రాల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌క‌పోతే అమెరికా, ఇజ్రాయెల్‌ను ఎదుర్కొన‌డం ఇరాన్‌కు క‌ష్ట‌మే..

iran-us-china-relations

iran-us-china-relations I 1826 I రేపు చైనాలో పుతిన్ ప‌ర్య‌ట‌న‌
అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ప‌ర్య‌ట‌న ముగిసిన వెంట‌నే ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ ప‌ర్య‌ట‌న ఖ‌రారు కావ‌డంలో కూడా ప‌లు అనుమానాలు రేక‌త్తిస్తుంది. హోర్ముజ్ జ‌ల‌సంధి విష‌యంలో ఇరాన్‌తో చైనా ర‌ణ‌రంగానికి దిగితే.. చైనాలో ఆయిల్ సంక్షోభం తీవ్ర‌త‌రం అవుతుంది. అందుకు ర‌ష్యా అధ్య‌క్షుడితో చైనా అధ్య‌క్షుడు వాణిజ్య ఒప్పందాల్లో ఆయిల్ ఒప్పందాల‌ను కుదుర్చుకునే అవ‌కాశం ఉంటుంది. చైనా లాంటి పెద్ద దేశాల‌తో ర‌ష్యా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవ‌డం ఇరు దేశాల‌కు లాభ‌దాయ‌కమే.

iran-us-china-relations

iran-us-china-relations I 1826 I ఇరాన్ ను ఒంట‌రి చేయ‌డ‌మే…అంత‌రాంగిక ఒప్పందం కుదిరి ఉండొచ్చు
అమెరికా, చైనాల మ‌ధ్య అంత‌రాంగిక ఒప్పందం కుదిరి ఉండొచ్చు అని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. చైనాలో అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ప‌ర్య‌ట‌న అనంత‌రం పుతిన్ కూడా ప‌ర్య‌టిస్తున్నారంటే అనుమానించ‌వ‌ల‌సిందే. తైవాన్ విష‌యంలో అమెరికా జోక్యం చేసుకోక‌పోతే… ఇరాన్ విష‌యంలో చైనా జోక్యం చేసుకోకూడ‌ద‌న్న ఒప్పందాలు వారి మ‌ధ్య కుదిరి ఉంటాయ‌ని చెప్ప‌వ‌చ్చు. అందుకే ఇరాన్ ఒక అడుగు ముందుకు వేసి యూఏఐ దేశాల‌పై దాడులు ఉధృతం చేసింది.

iran-us-china-relations I 1826 I ఇరాన్ ను ఒంట‌రి చేయ‌డ‌మే…అణు విద్యుత్ కేంద్రంపై దాడి
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ మళ్లీ దాడులు చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చిన వేళ యూఏఈలోని బరకా అణు విద్యుత్తు కేంద్రంపై ఆదివారం డ్రోన్‌ దాడి జరిగింది. ప్లాంట్‌లోని విద్యుత్తు జనరేటర్‌ వద్ద ఈ దాడి జరగడంతో మంటలు చెలరేగాయని అబుదాబి మీడియా ఆఫీస్‌ వెల్లడించింది. రేడియేషన్‌ ప్రభావం చూపే స్థితిలో వెలువడలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్లాంట్‌ కీలక విభాగాలు సాధారణంగానే పని చేస్తున్నాయని వెల్లడించారు. ఈ దాడిపై అంతర్జాతీయ అణు శక్తి ఏజెన్సీ ఆందోళన వ్యక్తం చేసింది. హొర్ముజ్‌ జల సంధి మార్గంపై ఆధారపడకుండా ముడి చమురును ఎగుమతి చేసే కొత్త పైప్‌లైన్‌ ప్రాజెక్ట్‌ పనులను యూఏఈ వేగవంతం చేసిన వేళ ఈ దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తున్నది. సౌదీ సరిహద్దుల్లోని పశ్చిమ ఎడారి మారుమూల ప్రాంతంలో ఈ విద్యుత్తు కేంద్రం ఉన్నది. అరేబియా ద్వీప కల్పంలో ఇదే ఏకైక అణు విద్యుత్తు కేంద్రం. ఈ దాడిని భార‌త్‌తోపాటు ప‌లు దేశాలు ఖండించాయి.

ALSO READ : who I Global Emergency I 1976 I ఆంక్ష‌లు వ‌ద్దు.. అప్ర‌మ‌త్తంగా ఉండాలి!

Leave a Reply