Nandyala | ఎత్తిపోతల పథకం కాలువలో వింత జీవులు
నంద్యాల బ్యూరో, జనవరి 30 : నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న కొత్తపల్లి మండలం సంగమేశ్వరం ఎత్తిపోతల పథకం కాలువలో గురువారం వింత జీవులు ప్రత్యక్షమయ్యాయి. అటువైపు వెళుతున్నస్థానికులు గమనించి అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఎత్తిపోతల పథకం కాలువలో దాదాపు 5జీవులు ఈదుకుంటూ పైకి లేస్తూ మనుగుతూ వెళ్తున్నాయి. అవి నీటి కుక్కలా మరే రకమైన జంతువులా అన్న విషయం తెలియాల్సి ఉంది. అవి చేపల కోసం ఎదురుచూస్తున్నాయని కొంతమంది తెలుపుతున్నారు. వాటి గురించి అధికారులు అవి ఏ రకమైన జంతువులనే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.