12 people died | 12మంది మృతి, 25మందికి గాయాలు
12 people died | 12మంది మృతి, 25మందికి గాయాలు
12 people died | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ట్రక్ బోల్తాపడటంతో 12మంది మృతిచెందగా, మరో 25మంది తీవ్రంగా గాయపడ్డారు.
ముంబై-అహ్మదాబాద్ హైవేపై ప్రయాణిస్తున్న ట్రక్ అకస్మాత్తుగా అదుపుతప్పి బోల్తాపడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద ధాటికి వాహనం పూర్తిగా దెబ్బతింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
