Cricket in India | స్వయం ప్రతిపత్తి సంస్థగా బీసీసీఐకి ఊరట
Cricket in India | స్వయం ప్రతిపత్తి సంస్థగా బీసీసీఐకి ఊరట
Cricket in India | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ)కి సంబంధించిన కీలక కేసులో కేంద్ర సమాచార కమిషన్ (CIC) కీలక తీర్పు వెలువరించింది. భారత జట్టుకు ఆటగాళ్ల ఎంపిక, బీసీసీఐ అధికారాలపై దాఖలైన అప్పీల్‌ను కమిషన్ కొట్టివేసింది. బీసీసీఐ ఆర్టీఐ చట్టం పరిధిలోకి రాదని స్పష్టం చేసింది.
బీసీసీఐ తమిళనాడు సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం కింద నమోదైన ప్రైవేట్ స్వయం ప్రతిపత్తి సంస్థ అని CIC పేర్కొంది. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకోవడం లేదని, ఇది ప్రభుత్వ అధికార సంస్థ కాదని తెలిపింది.
ఆర్టీఐ చట్టం-2005 కింద బీసీసీఐ సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని కమిషన్ స్పష్టం చేసింది. బీసీసీఐ స్వతంత్రంగా, స్వయం ప్రతిపత్తితో పనిచేస్తోందని, ప్రభుత్వ జోక్యం లేకుండానే నిర్ణయాలు తీసుకుంటోందని వివరించింది. ఆర్థికంగా కూడా సంస్థ స్వీయ నిర్వహణలో ఉందని CIC పేర్కొంది.
