అత్యధిక సభ్యత్వాల నమోదు అభినందనీయం

అత్యధిక సభ్యత్వాల నమోదు అభినందనీయం

కేశవ నారాయణకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, వెంకట్రామ్ సన్మానం

కోడూరు, ఆంధ్ర‌ప్ర‌భ : జనసేన పార్టీలో అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ దిశానిర్దేశాలకు అనుగుణంగా అత్యధిక ఉద్యమి సభ్యత్వాలు నమోదు చేసిన సాధకులు అభినందనీయులు అని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం కోడూరు మండలం ఊటగుండంలో జనసేన పార్టీ సాధక్ దేవనబోయిన కేశవ నారాయణ అత్యధికముగా 1,035 ఉద్యమి సభ్యత్వాలు నమోదు చేసిన సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ వారి స్వగృహంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా సత్కరించి అభినందించారు.

కోడూరు మండలంలోని తీర ప్రాంత గ్రామాల్లో ప్రధానంగా అగ్నికుల క్షత్రియ, యాదవ, ముదిరాజ్, గౌడ, యానాది, దళిత సామాజిక వర్గాల యువత జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వాలు స్వీకరించటం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు జనసేన పార్టీ పట్ల ఉన్న ఆదరణ మరోసారి నిరూపితం అయిందన్నారు. జనసేన పార్టీ బలోపేతానికి కీలకమైన ఉద్యమి సభ్యత్వాలను పార్టీ అధినేత ఆదేశాల మేరకు నమోదు చేసిన సాధకులు ప్రతి ఒక్కరూ అభినందనీయులు అన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు కమిటీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ దేవనబోయిన కనకదుర్గ పాల్గొన్నారు.

Leave a Reply