కల్లాల నుండి వడ్ల సంచులు చోరి..

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : తూకం వేసేందుకు కల్లాల్లో సిద్ధం చేసి ఉంచిన వడ్ల సంచులను దొంగలు ఎత్తుకెళ్లిన సంఘటన భీంగల్ మండలం సంతోష్ నగర్ లో జరిగింది. బాధిత రైతు పాల్త్యా శివ తెలిపిన వివరాల ప్రకారం తన వ్యవసాయ పొలంలో తూకం వేసేందుకు వడ్ల సంచులను సిద్ధం చేసి ఉంచాడు. సుమారు 254 బస్తాల ధాన్యం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు సిద్ధం చేసి ఉంచాడు.

సిద్ధం చేసి 45 రోజులు అవుతున్నా కాంటా చేసేందుకు సొసైటీ అధికారులు ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. సిద్ధం చేసి ఉంచిన ధాన్యం బస్తాలు 254 లో నుండి 22 బస్తాలు దొంగలు ఎత్తు కెల్లినట్టు బాధితుడు తెలిపారు. ఈ నెల 17 వరకు బస్తాలు ఉన్నాయని సోమవారం ఉదయం వెళ్లి చూసే సరికి 22 బస్తాలు ఎత్తు కెల్లారని వాపోయాడు. సొసైటీ అధికారులు సరైన సమయంలో తూకం వేస్తే బస్తా లు పోయేవి కావని, బస్తా లు పోయేందుకు సొసైటీ నిర్లక్ష్యం కారణం అని ఆరోపించారు. దొంగ తనం విషయం గురించి పోలీసులకు పిర్యాదు చేసినట్టు తెలిపారు.

Leave a Reply