వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…..

వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…..
డిసిపి లక్ష్మీనారాయణ
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : వేసవికాలం దృష్ట్యా ఆరు బయట నిద్రించేటప్పుడు ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని రూరల్ డిసిపి లక్ష్మీనారాయణ సూచించారు. ఆదివారం సాయంత్రం మండల పరిధిలోని లింగగూడెం గ్రామంలో గ్రామ పెద్దలతో కలిసి గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వేసవికాలంలో గ్రామీణ ప్రాంతాలలో దొంగతనం జరిగే అవకాశం ఉన్నది మీ విలువైన వస్తువును జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి, గంజాయి వినియోగం వల్ల కలిగే హానికర ప్రభావాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.
ట్రాఫిక్ నియమాలను పాటించడం, హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు. అలాగే మహిళల భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అత్యవసర సమయంలో పోలీసులను ఎలా సంప్రదించాలో వివరించారు. గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం వల్ల వ్యక్తిగతంగా సమాజానికి కలిగే నష్టాలను వివరించి, అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట సిఐ వెంకటేశ్వర్లు స్థానిక ఎస్సై అర్జున్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
