రెండున్నర లక్షల ఎల్వొసీ అందజేత..
భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : భీంగల్ పట్టణ కేంద్రానికి చెందిన తీట్ల అంకిత్ ఆపరేషన్ నిమిత్తం రూ రెండున్నర లక్షల ఎల్వోసీ ని అందజేశారు. బాధితుడు తీవ్ర అనారోగ్యం తో నిమ్స్ ఆసుపత్రి లో చేరడం జరిగింది. ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించారు. వైద్య సహాయం కొరకు బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునిల్ కుమార్ ను ఆశ్రయించడం జరిగింది. స్పందించిన ముత్యాల సునిల్ కుమార్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ రెండున్నర లక్షల ఎల్వోసీ అందించడం జరిగింది. ఎల్వోసీ అందించి వైద్య సహాయం కొరకు సహకరించిన ముత్యాల సునిల్ కుమార్ తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
