పూరి జగన్నాథ్ వేదికగా భరత నాట్య నృత్య ప్రదర్శన..

మక్తల్, ఆంధ్రప్రభ : ఒడిశా రాష్ట్రం పూరి లో సంస్కృతి భవన్ లో భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జై జగన్నాథ్ జగన్నాధ సంగీత నృత్య మహోత్సవం సందర్భంగా ఆదివారం నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణానికి చెందిన ఆధ్యనృత్యాలయ భరత నాట్య అకాడమీ తరుపున గురువు హారతి జ్యోషి శిష్య బృందం అద్భుతమైన భరతనాట్య నృత్యంను ప్రదర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను నిర్వాహకులు శాలువా కప్పి సత్కరించి, జ్ణాపిక అందజేశారు. నృత్య ప్రదర్శన చేసిన వారిలో విద్యార్థులు సాయి సప్తశ్రీ, మేదిని, ఆధ్య,ప్రిశ ,బృంద,హాసిని,ఆధ్య గౌడ్ ఉండగా.. తల్లిదండ్రులు పసుల రంజిత్ రెడ్డి ,మానస, వాణి, దినేష్, రాధా, స్వాతి,అరుణ సబితా తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు ఆధ్య ఆద్య నృత్యాలయ గురువులు హారతి జోషి ని ప్రత్యేకంగా సత్కరించి జ్ఞాపికను అందజేసి అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చి అద్భుత ప్రదర్శన ఇవ్వడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఒడిస్సా ప్రజల మన్ననలు పొందడం పట్ల ఈ సందర్భంగా ఆద్య నృత్యాలయ నిర్వాహకులు హారతి జోషి సంతోషం వ్యక్తం చేశారు. తమ నృత్యాలయ చిన్నారుల పట్టుదల కృషి వల్ల ఇప్పటికే దేశంలోని అనేక ప్రాంతాలలో నృత్య ప్రదర్శనలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి చోట ప్రత్యేక ప్రశంసలు పొందడం మరువలేని జ్ఞాపకంగా మిగిలిపోతున్నాయని ఆమె పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇంకా అద్భుతమైన నృత్య ప్రదర్శన ద్వారా మక్తల్ పేరు ప్రతిష్టలను దేశం నలుమూలల వ్యాప్తి చేయడమే తన లక్ష్యమని హారతి జోషి పేర్కొన్నారు.