ఐ సి ఎఫ్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ

ఐ సి ఎఫ్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : మండలంలో నింబగల్లు గ్రామంలో ఆదివారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఇన్పునెన్స్ చార్టిబుల్ ఫౌండేషన్ సహకారంతో ఉచిత టైలరింగ్ శిక్షణ పొందిన మహిళలకు 50 శాతం సబ్సిడీతో కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఐ సి ఎఫ్ సంస్థ చైర్మన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఐ సి ఎఫ్ సంస్థ ద్వారా మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. దీనితో దాదాపు 30 కుటుంబాలకు ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. మహిళలకు కుట్టు శిక్షణ ఇవ్వడంతో, పయ్యావుల సోదరులకు, ఐ సి ఎఫ్ సంస్థకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు కొంకా సిద్దప్ప, శివకుమార్, కలువకూరి వెంకటేశులు, శివప్ప, భారతి, డైరెక్టర్ వన్నూరుస్వామి, మండలకో ఆర్డినేటర్స్ మర్రిస్వామి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.

Leave a Reply