చెన్నూర్ లో రైతు పక్షాన బిఆర్ఎస్ నిరసన గళం..

చెన్నూర్ లో రైతు పక్షాన బిఆర్ఎస్ నిరసన గళం..
చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లాచెన్నూర్ పట్టణంలోని వ్యవసాయ గిడ్డంగుల సముదాయం గోడౌన్ వద్ద వరి ధాన్యం కొనుగోళ్లు దిగుమతుల్లో జరుగుతున్న జాప్యన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు కలిసి భారీ నిరసన చేపట్టారు. రైతుల ఆవేదన గత నాలుగు రోజులుగా లారీలు, ట్రాక్టర్లలో వరి ధాన్యాన్ని లోడ్ చేసుకుని దిగుమతి కోసం ఇక్కడే వేచి చూస్తున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.అధికారుల అలసత్వం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు.
మంత్రి ఎంపీలపై విమర్శలు స్థానిక మంత్రి వివేక్, ఆయన కుమారుడు ఎంపీ వంశీకృష్ణలపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహంవ్యక్తం చేశారు.వారు పదవులు అనుభవించడానికే పరిమితమయ్యారని రైతుల సమస్యలను పట్టించుకోవడంలో వారికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు.పోలీసులతో వాగ్వాదం ఉద్రిక్తత రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా పోలీసులు జోక్యం చేసుకుని అడ్డుకోవడానికి ప్రయత్నించారు.దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికారంలో ఉన్న మీ మంత్రి చెబితే ఇక్కడికి వచ్చి మమ్మల్ని అడ్డుకుంటారా అంటూ బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.మంత్రి వివేక్ ఇప్పటికైనా తక్షణమే స్పందించి సకాలంలో ధాన్యం కొనుగోళ్లు జరిగేలా, వెనువెంటనే దిగుమతులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
