ఏర్గట్లలో అగ్నిప్రమాదం.. ఇల్లు దగ్ధం

ఏర్గట్ల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన బోడ భూమయ్య తండ్రి పెద్ద గంగారం‌కు చెందిన రెండు గదుల ఇల్లు పూర్తిగా దగ్ధమైంది.

ఇంటి నుంచి అకస్మాత్తుగా మంటలు ఎగసిపడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై గ్రామ సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డికి సమాచారం అందించారు. ఆయన తక్షణమే స్పందించి గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్‌ను ఘటన స్థలానికి పంపించారు.

వాటర్ ట్యాంకర్ సహాయంతో స్థానికులు మంటలను ప్రాథమికంగా అదుపులోకి తెచ్చారు. అనంతరం ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు.

ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే టీవీ, ఫ్రిజ్, ఫ్యాన్లు, తలుపులు, కిటికీలు సహా గృహోపకరణాలు, ఇతర విలువైన వస్తువులు పూర్తిగా కాలిపోయాయి.

ఈ ఘటనపై తహసీల్దార్ మల్లయ్య స్పందిస్తూ.. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply