మినీ వ్యాన్ మురుగు కాలువలో పడి ఇద్దరు మృతి

బంటుమిల్లి, ఆంధ్రప్రభ ; కృష్ణా జిల్లాలో తీవ్ర విషాద సంఘటన జరిగింది. ఆదివారం తెల్లవారు జామున బంటుమిల్లి మండలంలో జరిగిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పెడనని నియోజకవర్గం బంటుమిల్లి మండలం పెద్ద తుమ్మిడి మురుగు కాలువ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సంఘటనా స్థలంలో మృతిచెంది చెందిన పరిస్థితి. స్థానికంగా విషాదాన్ని నింపింది. మృతులను ఏనుమల శివయ్య (34), కాగిత అమలేశ్వరరావు (30)గా పోలీసులు గుర్తించారు. హనుమాన్ జంక్షన్ వెళ్తున్న మినీ లారీ అతివేగానికి కారణమని స్థానికుల సమాచారం. పోలీసులు వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేశారు.

