బుల్లెట్ బండిపై పర్యటించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్‌కర్నూల్ జిల్లా, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం బుల్లెట్ మోటార్‌సైకిల్‌పై పర్యటించారు. తన సొంత నియోజకవర్గమైన కొల్లాపూర్‌లో మంత్రి స్వయంగా బుల్లెట్ బండి నడుపుతూ పలు ప్రాంతాలను సందర్శించారు.
ముందుగా ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన మంత్రి అక్కడి సదుపాయాలు, వైద్య సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెంట్లవెల్లి రోడ్డులో ఉన్న మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. మంత్రి బుల్లెట్ బండిపై ప్రయాణిస్తూ పర్యటించడం పట్టణ ప్రజలను ఆకట్టుకుంది. ప్రజలు ఆసక్తిగా, ఆశ్చర్యంగా వీక్షించారు.
