14points | లేదంటే భవితవ్యం వారి చేతుల్లోనే..

14points | లేదంటే భవితవ్యం వారి చేతుల్లోనే..

14points | సన్‌రైజర్స్‌కు ఇంకా ఉన్న ఆశలు
14 పాయింట్లతోనూ ప్లేఆఫ్స్ అవకాశం
పంజాబ్, రాజస్థాన్ ఫలితాలపై ఆధారపడిన భవితవ్యం
నెట్ రన్ రేట్ కీలకంగా మారనున్న పరిస్థితి
చెన్నై, బెంగళూరుతో కీలక పోరులు

14points | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ చేరుకోవడానికి క్లిష్ట ప‌రిస్థితి ఎదుర్కొంటొంది. ప్ర‌స్తుతం ఆ జ‌ట్టు 14 పాయింట్లు క‌లిగి ఉంది. 12 మ్యాచులు ఆడి ఏడు గెలిచింది… ఐదు ఓడింది. అయితే ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ఆఖ‌రి రెండు మ్యాచుల్లో త‌ప్ప‌క గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌కు అర్హ‌త సాధిస్తుంది. అయితే, 14 పాయింట్లతో కూడా క్వాలిఫై కావ‌డం సాధ్యమే. కానీ దీనికి పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తమ మిగిలిన అన్ని మ్యాచ్‌లలో ఓడిపోవాలి.

14points

గుజ‌రాత్‌, బెంగ‌ళూర్‌, రాజ‌స్థాన్, పంజాబ్ 16 కంటే ఎక్కువ పాయింట్లు సాధిస్తే మాత్రం హైద‌రాబాద్ జ‌ట్టుకు ఇబ్బందే. పంజాబ్, రాజస్థాన్ అన్ని మ్యాచ్‌లలో ఓడితే, నెట్ రన్ రేట్‌తో సంబంధం లేకుండా 14 పాయింట్లు అర్హతకు సరిపోతాయి. ఈ పరిస్థితుల్లో గుజ‌రాత్‌, బెంగ‌ళూర్‌, చెన్నై, హైద‌రాబాద్ అర్హత సాధిస్తాయి. ఒకవేళ పంజాబ్ ఒక మ్యాచ్ గెలిచి 15 పాయింట్లకు చేరుకుంటే, 14 పాయింట్లతో అర్హత సాధించే అవకాశం నెట్ రన్ రేట్‌పై ఆధారపడి ఉంటుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 12 మ్యాచ్‌లలో 14 పాయింట్లు, 0.331 నెట్‌ర‌న్‌రేట్‌తో ఉంది. మిగిలిన మ్యాచ్‌లు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో త‌ల‌ప‌డాల్సి ఉంది.

CLICK HERE TO READ 16mayipl | నేడు గుజ‌రాత్‌, కోల్‌క‌తా ఢీ

CLICK HERE TO READ MORE

Leave a Reply