స్వచ్ఛతకు తిరుపతి పోలీసులు శ్రీకారం

స్వచ్ఛతకు తిరుపతి పోలీసులు శ్రీకారం

  • జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్‌లలో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు

తిరుపతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ సర్వేక్షణ్” కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్‌లలో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని పోలీస్ స్టేషన్ ఆవరణలు, పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు.

పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ స్వచ్ఛత ప్రాముఖ్యతను వివరించారు. పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయని ఎస్పీ తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, కార్యాలయం, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. “స్వచ్ఛ ఆంధ్ర” లక్ష్య సాధనలో ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.

Leave a Reply