కలెక్టర్ ను కలిసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు

వికారాబాద్, ఆంధ్రప్రభ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ దీపక్ తివారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ కార్యకలాపాలు, సేవా కార్యక్రమాలు మరియు సంస్థాగత నిర్మాణం గురించి కలెక్టర్‌కు వివరించారు.

అనంతరం కలెక్టర్ దీపక్ తివారి స్వయంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (IRCS) జీవితకాల సభ్యత్వాన్ని స్వీకరించారు. జిల్లా అధికారులు కూడా రెడ్ క్రాస్ సొసైటీలో జీవితకాల సభ్యత్వం పొందాలని ఆయన సూచించారు.

రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు కోసం చేపట్టనున్న నెల రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (DRDO) శ్రీనివాస్‌ను నోడల్ అధికారిగా నియమించారు. అలాగే కలెక్టరేట్ ప్రాంగణంలోని DRDO కార్యాలయ భవనం మొదటి అంతస్తులో రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు కేంద్రం ఏర్పాటు చేయడానికి కలెక్టర్ అనుమతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ టి. సాయి చౌదరి, వైస్ చైర్మన్ డాక్టర్ సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply