వెంకట్రావుపేట గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..

వెంకట్రావుపేట గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

  • ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

కౌడిపల్లి, ఆంధ్రప్రభ : మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గేటు వద్ద జాతీయ రహదారి–765పై గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళ్తే.. మెదక్ కలెక్టరేట్‌లో పనిచేస్తున్న ఓ అధికారి హైదరాబాదు నుంచి మెదక్ వైపు కారులో ప్రయాణిస్తుండగా, వెంకట్రావుపేట గేటు వద్ద నర్సాపూర్ మండలం అహ్మద్‌నగర్ గ్రామానికి చెందిన చింతల మల్లేశం (46) తన ద్విచక్ర వాహనంపై అహ్మద్‌నగర్ గ్రామం వైపు రహదారి దాటే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కారు అతని వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో మల్లేశం అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద తీవ్రతకు వాహనాలు ఎగిరిపడి, వెంకట్రావుపేట గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ డప్పు కుమార్పై పడ్డాయి. దీంతో కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన కుమార్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply