టీజీఐఐసీ కార్యాలయం ప్రారంభించిన మంత్రులు

టీజీఐఐసీ కార్యాలయం ప్రారంభించిన మంత్రులు

సంగారెడ్డి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ‌: సంగారెడ్డి పట్టణంలోని ఆదర్శ్​ నగర్‌లో​ టీజీఐఐసీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వ‌హించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​ బాబు, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్​ రాజనర్సింహ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. రిబ్బన్​ కట్​ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా నూతన కార్యాలయంలో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టీజీఐఐసీ చైర్​ పర్సన్​ నిర్మలజగ్గారెడ్డిని నూతన కార్యాలయంలోని కుర్చీలో కూర్చోబెట్టారు. మంత్రులు శ్రీధర్​ బాబు, దామోదర్​ రాజనర్సింహ, టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్​ ప్రతీక్​ జైన్​, ఎస్పీ పరితోష్​ పంకజ్​, జహీరాబాద్​ ఎంపీ సురేష్​ షెట్కార్​, నారాయణఖేడ్​ ఎమ్మెల్యే డాక్ట‌ర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, సెట్విన్​ ఛైర్మన్​ గిరిధర్​ రెడ్డి, టీజీఐఐసీ జోన‌ల్ మేనేజ‌ర్ ఆర్‌.విఠ‌ల్‌, డిప్యూటీ జోన‌ల్ మేనేజ‌ర్ అధికారులు ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డికి అభినందనలు తెలిపారు.

Leave a Reply