ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని కలిసిన శ్యాంసుందర్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ దేప శ్యాంసుందర్ ముదిరాజ్ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం రాజగోపాల్ రెడ్డి కి శ్రీ రామలింగేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేసి, ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రామలింగేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తలు దౌడి లింగస్వామి, సిలువేరు శంకర్, ఎల్లంకి లింగాచారి, జెర్రిపోతుల అఖిల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
