ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలి

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలి

-రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి

కేసముద్రం, ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు ప్రజా ప్రతినిధులు యువజన సంఘాలు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు కృషి చేయాలని రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం వేం స్వగ్రామమైన అర్పణ పెళ్లిలో బడిబాట పోస్ట్ అన్న ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వేం మాట్లాడుతూ… బడిబాట ప్రధాన లక్ష్యం పాఠశాల వయస్సు గల ప్రతి చిన్నారిని గుర్తించి సమీప ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం 100 శాతం నమోదు సాధించ డమేనని అన్నారు ప్రభుత్వ పాఠశాలలలో అత్యుత్తమ ప్రతిభ నైపుణ్యం కలిగిన విద్యావం తులైన ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందిస్తు న్నారని తెలిపారు విద్యార్థులకు ప్రభుత్వం ఏకరూప దుస్తులు పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు కిడ్స్ రాగిజావ, బ్రేక్ఫాస్ట్, నోట్ బుక్స్ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

వచ్చే విద్యా సంవత్సరం నుండి తెలంగాణలోని అన్ని మండల కేంద్రాలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంట్లో భాగంగా అన్ని పాఠశాలలో నర్సరీ నుండి పిసి వరకే కాకుండా ఉదయం విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, సాయంత్రం స్నాక్స్, బస్సు సౌకర్యం ,ల్యాబ్స్ విద్యార్థులకు సరిపడా గదులు భోజనశాలలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను ప్రజాప్రతినిధులు గ్రామస్తులకు విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియజేసి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి కృషి చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వ పాఠశాలలో నమోదు శాతాన్ని పెంచాలని ఆయన అన్నారు. నమోదు శాతాన్ని పెంచి బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను అందేలా కృషి చేయాలన్నారు. ఏ ఒక్క విద్యార్థి విద్యకు దూరం కాకుండా ఉండడానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, ఆర్టిఏ నెంబర్ రావుల మురళి , మాజీ ఎంపీటీసీ బండారు దయాకర్, ఉప్పరపల్లి కేసముద్రం విలేజ్ కాంప్లెక్స్ హెచ్ఎంలు కాట్రగడ్డ చంద్రశేఖర్, వాసిరెడ్డి రాజశేఖర్, ఉపాధ్యాయులు తుమికి వినోద్ రాజు, నెహ్రూ సంపత్, బోళ్ల సురేష్ ,రవీందర్ ,నాగయ్య, ప్రవీణ్ ,మహేష్, సిఆర్పి మురళి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply