రెండు ఇసుక ట్రాక్టర్ల సీజ్..
చెన్నూర్, ఆంధ్రప్రభ : గోదావరి నుంచి రాత్రి సమయంలో గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్ లను పట్టుకున్న చెన్నూర్ టౌన్ సీఐ బ్యాన్సిలాల్ ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం రాత్రి సమయంలో పెట్రోలింగ్ చేయుచున్న పోలీసులకు అందిన సమాచారం మేరకు గోదావరి నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్ లను చెన్నూర్ మండలం రాయపేట వద్ద పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్స్, ఓనర్స్ లపై కేసు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిగినదని పట్టణ సీఐ బన్సీలాల్, ఎస్ ఐ శ్యాంపటేల్ తెలిపారు. ఎవరైనా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోబడటమే గాక ట్రాక్టర్ మోటర్ వెహికిల్ యాక్ట్ ప్రకారం డ్రైవర్ ల లైసెన్స్ రద్దు చేయించడం, ట్రాక్టర్ లను మైనింగ్ డిపార్ట్మెంట్ వారికి అప్పగించడం జరుగుతుందని ఈ సందర్బంగా పేర్కొన్నారు.
