టేకుమట్ల కాంగ్రెస్ పగ్గాలు తిప్పిరెడ్డి కృష్ణారెడ్డికిపార్టీ బలోపేతమే లక్ష్యం.. అందరినీ కలుపుకుని ముందుకు
టేకుమట్ల, ఆంధ్రప్రభ : టేకుమట్ల మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా పంగిడిపల్లి గ్రామానికి చెందిన తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న కృష్ణారెడ్డి తన నియామకంపై హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచనలు, పార్టీ అధిష్ఠానం మార్గదర్శకాలకు అనుగుణంగా మండలంలోని నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేస్తామని తెలిపారు. కార్యకర్తలకు అండగా నిలుస్తూ పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేస్తానని చెప్పారు. తనకు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే జీఎస్సార్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ కుటుంబ సభ్యులందరికీ కృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
