road accident | ఇద్దరు యువకులు మృతి

road accident | ఇద్దరు యువకులు మృతి

road accident | నాదెండ్ల, ఆంధ్రప్రభ : సాతులూరు : చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో ఉన్న గుంటూరు – శ్రీశైలం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఫిరంగిపురం మండలం పొనుగుబాడు గ్రామానికి చెందిన జమ్ముల సీతారామయ్య (27), వేమూరి అశోక్ (25) లు బిర్యానీ తెచ్చుకోవడానికి నరసరావుపేట వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో సాతులూరు పెట్రోలు బంకు సమీపంలో తిరుమల ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బస్సు యువకులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొని అదుపు తప్పి కొంత దూరం ఈడ్చుకెళ్ళింది. దీంతో, ఇద్దరు యువకులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు.

ప్రమాద సమాచారం తెలుసుకున్న నాదెండ్లపోలీసు స్టేషన్ ఇంఛార్జి ట్రైనీ ఐపీఎస్ నిరంజన్, ఎస్సై వెంకటేశ్వర రావు, నరసరావుపేట గ్రామీణ సిఐ, ఎస్సైలు ఘటన జరిగిన ప్రదేశానికి చేరుకుని ఇరువురి మృతదేహాలను నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల బంధువులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున ప్రమాద స్థలికి చేరుకోగా అప్పటికే మృతదేహాలను అక్కడి నుండి తరలించగా వారంతా నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

road accident |
road accident |
road accident |

CLICK HERE TO READ MORE : Industry | భారీ మంటలు.. పలువురు మృతి

CLICK HERE TO READ MORE