ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు బంద్..? క్లారిటీ ఇచ్చిన అధికారులు

ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు బంద్..? క్లారిటీ ఇచ్చిన అధికారులు

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూసివేయనున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బంకులు పని చేయవని, ప్రజలు ముందుగానే ఇంధనం నిల్వ చేసుకోవాలని కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో వాహనదారుల్లో గందరగోళం నెలకొంది.

అయితే ఈ ప్రచారంపై స్పందించిన ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ ప్రతినిధులు స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు బంద్ చేయాలనే నిర్ణయం ఇప్పటి వరకు తీసుకోలేదని తెలిపారు. 2017-18 సంవత్సరంలో ఇలాంటి ప్రతిపాదనపై చర్చ జరిగినప్పటికీ, తర్వాత ఆ ఆలోచనను అమలు చేయలేదని పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం రాష్ట్రంలోని పెట్రోల్ బంకులు యథావిధిగా పని చేస్తున్నాయని వెల్లడించారు. ప్రజలు అధికారిక సమాచారం వచ్చినప్పుడే విశ్వసించాలని సూచించారు.

Leave a Reply