మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక

మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక
హుస్నాబాద్, మే 13(ఆంధ్రప్రభ)
హుస్నాబాద్ మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగాయి. సోమవారం రోజున మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికను పురస్కరించుకొని ఎక్స్ అఫీషియో మెంబర్ గా మంత్రి పొన్నం హాజరయ్యారు. ఈ సందర్భంగా నాలుగు కోఆప్షన్ స్థానాలకు గాను మూడు స్థానాలను ఏకగ్రీవంగా ఎన్నిక కాగా నాలుగో స్థానం కోసం ఆశావాహుల సంఖ్య పెరగడంతో ఎన్నిక వాయిదా పడింది.ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు కో ఆప్షన్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు.
