పోస్ట్ మాస్టర్ పై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా..?

పోస్ట్ మాస్టర్ పై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా..?

వెల్దండ, ఆంధ్రప్రభ : వెల్దండ మండల పరిధిలోని పోతేపల్లి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పై గ్రామ సర్పంచ్ తగ్గుళ్ళ కొండల్ యాదవ్ పిర్యాదు చేశారు. పోతేపల్లి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బిపిఎమ్) వావిళ్ళ కిరణ్ కుమార్ యాదవ్ నిబంధనలను అతిక్రమించి పోస్ట్ ఆఫీస్ కి వచ్చిన లెటర్లను ముందస్తుగానే ఓపెన్ చేసి చూస్తున్నారని వెల్దండ (ఎస్ పి ఎం) సబ్ పోస్ట్ మాస్టర్ కి పిర్యాదు అందజేశారు.

సకాలంలో ఉత్తరాలు అందివ్వకుండా జాప్యం చేస్తూ నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఉమ్మడి గ్రామ పంచాయతీ పరిధిలోని ఐదు గ్రామాలకు ఉత్తరాలు సకాలంలో అందించకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మండల స్థాయి అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. లేనియెడల వనపర్తి డివిజన్ పోస్ట్ ఆఫీస్ కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply