పెనుగోలనులో ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహం ఏర్పాటు

పెనుగోలనులో ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహం ఏర్పాటు

గంపలగూడెం, ఆంధ్రప్రభ :మండలంలోని పెనుగొలను గ్రామంలోని బొడ్రాయి సెంటరు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అభయాంజనేయ స్వామి ఏకశిలా విగ్రహ ప్రతిష్ట మంగళవారం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది ముందుగా వేద పండితులు కోట శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో స్వామివారి విగ్రహానికి ప్రత్యేక అభిషేకాలు,పూజలు చేసి స్వామివారి హోమం చేశారు.అనంతరం భక్తుల సహకారంతో అన్నదానం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. పలు గ్రామాలకు చెందిన భక్తులతో స్వామి వారి ప్రతిష్ట చేసిన ప్రాంగణము నిండిపోయింది‌.