మేలైన వంగడాలతో అధిక దిగుబడులను సాధించాలి

మేలైన వంగడాలతో అధిక దిగుబడులను సాధించాలి

  • రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

హసన్ పర్తి, ఆంధ్రప్రభ ; రైతులు మేలైన వంగడాలతో, సేద్యం చేపట్టి అధిక దిగుబడులు సాధించడం సులభమవుతుందని వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త నాగభూషణం సూచించారు. మంగళవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం సూదన్ పల్లిలో ఏఈఓ శైలజ అధ్యక్షతన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు ఈ మేరకు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కరపత్రాన్ని రైతులతో పాటు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నాగభూషణం మాట్లాడుతూ.. భూ సారం దెబ్బ తినకుండా ఉండేందుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. రైతులు అధిక మోతాదులో ఎరువులు వాడితే జరిగే నష్టాన్ని, అనర్థాలను వివరించారు.రైతులు ఎరువుల వినియోగాన్ని తగ్గించుకొని,పెట్టుబడి తగ్గించుకోవాలని కోరారు. అదేవిధంగా రైతులు చిరుధాన్యాలు,పప్పుదినుసులు,నూనె గింజల వంటి పంటలను సాగు చేసి మంచి దిగుబడులు సాధించవచ్చని తెలిపారు.

శాస్త్రవేత్త రాయినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని లాభ సాటిగా మార్చడానికి రైతులు నేరుగా శాస్త్రవేత్తల సలహాలు తీసుకోవాలని కోరారు. శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పర్యటించి సూచించిన నూతన సాగు పద్ధతులు చేపట్టాలని కోరారు.యూరియా,పురుగుల మందుల వాడకం తగ్గించి, సేంద్రీయ సాగుతో పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్ఎస్ఎం జిల్లా ఇంచార్జ్ పి.సారంగం,గ్రామ సర్పంచ్ ఆకారపు లక్ష్మి ,ఏటిఎంఏ సభ్యులు ఏం లింగారెడ్డి, గ్రామ రైతులు పాల్గొన్నారు.

Leave a Reply