అనధికారికంగా నివసిస్తున్న వారిని ఖాళీ చేయించేందుకు చర్యలు

అనధికారికంగా నివసిస్తున్న వారిని ఖాళీ చేయించేందుకు చర్యలు
- మంత్రి టీజీ భరత్ గుప్తా
కర్నూలు, ఆంధ్రప్రభ : కర్నూలు నగరంలోని ఎ, బి, సి. క్యాంపు క్వార్టర్స్లో అనధికారి కంగా నివాసముంటున్న వారిని ఖాళీ చేయించేం దుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ల తో కలిసి ఆర్ అండ్ బి, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులతో మంత్రి సమీక్షిం చారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్యాంపుల్లో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటుకు వీలుగా అనధికారికంగా నివాసముంటున్న వారిని ఖాళీ చేయించేం దుకు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ఎ, బి, సి. క్యాంపు క్వార్టర్స్లో అనధికారికంగా నివాసముంటున్న వారు ఈ నెల 25 వ తేదీ లోపు ఖాళీ చేయాలి
నగరంలోని ఎ, బి, సి. క్యాంపు క్వార్టర్స్లో అనధికారికంగా నివాసముంటున్న వారు ఈ నెల 25 వ తేదీ లోపు ఖాళీ చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఆర్ అండ్ బి ఎస్ఈ మహేశ్వర రెడ్డి, కర్నూలు మున్సిపల్ కమిషనర్ ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనురాధ,ఆర్ అండ్ బి ఈఈ సునీల్ రెడ్డి, కర్నూలు అర్బన్ తహసిల్దార్ రవి, కల్లూరు తహసిల్దార్ ఆంజనేయులు, కర్నూలు రూరల్ తహసిల్దార్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.
