విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 13న సర్పంచుల సమావేశం
విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 13న సర్పంచుల సమావేశం
మునుగోడు, ఆంధ్రప్రభ: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 13న మండల కేంద్రంలోని రైతు వేదికలో నియోజకవర్గ సర్పంచుల సమావేశం నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖ అధికారి తల్లమల్ల మల్లేశం తెలిపారు. ఈ సమావేశం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం హాజరవుతారని తెలిపారు. మునుగోడు, చండూరు,నాంపల్లి, గట్టుప్పల్,మర్రిగూడ మండలాల విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలు, గ్రామాభివృద్ధి అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని సర్పంచులు సమావేశానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
