ధాతృత్వం చాటుకున్న గ్రామ సర్పంచ్ కృష్ణమూర్తి

ధాతృత్వం చాటుకున్న గ్రామ సర్పంచ్ కృష్ణమూర్తి
తొర్రూరు, ఆంధ్రప్రభ: మండలంలోని చీకటాయపాలెం గ్రామ సర్పంచి చిదిరాల కృష్ణమూర్తి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల భవనాలకు సోమవారం సున్నాలు వేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం కొలుపుల శ్రీనివాస్ మాట్లాడుతూ .. దశాబ్దాల కాలంగా పాఠశాల భవనాలకు సున్నాలు లేక వెలవెలబోతున్న తరుణంలో పాఠశాల భవనాలకి కలర్స్ వేయించాలని సర్పంచ్ ను కోరడంతో తక్షణమే పెద్ద మనసుతో స్పందించి కలర్స్ వేయిస్తానని హామీ హామీ ఇచ్చి బడిబాట విద్య వారోత్సవాల సందర్భంగా పాఠశాలకు కలర్స్ వేయించడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సరిత, ఉపాధ్యాయ బృందం కె.రాములు, పి.వెంకటేశ్వర్లు, బి.కృష్ణమూర్తి, ఎస్. రాము, సభ్యులు రమేష్,శేఖర్, గ్రామ కార్యదర్శి షబ్బీర్ మీయా, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు హర్ష వ్యక్తం చేశారు.
