రాజకీయ జోక్యం ఉండదని స్పష్టీకరణ

రాజకీయ జోక్యం ఉండదని స్పష్టీకరణ

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : బండి సంజయ్ వ్యవహారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపడం లేదని, దర్యాప్తు పూర్తిగా నిష్పక్షపాతంగా సాగుతుందని స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుంటుందని, ఎవరినీ ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు.

విచారణ పారదర్శకంగా కొనసాగేందుకు ఒక మహిళా డీసీపీని ఇన్‌చార్జ్‌గా నియమించినట్లు మంత్రి తెలిపారు. బాధితులకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆధారాల ప్రకారం పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి నివేదిక సిద్ధం చేస్తామని వెల్లడించారు.

నేరం రుజువైతే ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు.